News November 17, 2025

PPP మోడల్‌లో ఆటోనగర్ బస్టాండ్ అభివృద్ధి.. ఉయ్యూరు, గుడివాడ కూడా?

image

విజయవాడ ఆటోనగర్ బస్టాండ్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 10 ప్లాట్‌ఫామ్స్, వ్యాపార సముదాయాలు ఉండేలా ప్లాన్ సిద్ధం చేశారు. అనుమతులు రాగానే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. రద్దీగా ఉన్న PNBSకి ప్రత్యామ్నాయంగా ఆటోనగర్ బస్టాండ్‌ను వినియోగించుకునే యోచనలో ఉన్నారు. ఉయ్యూరు, గుడివాడ బస్టాండ్‌ల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

Similar News

News March 5, 2026

రేపు నిజామాబాద్ రానున్న ఈటల రాజేందర్

image

మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం నిజామాబాద్‌కు రానున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ తరుఫున గెలిచిన కౌన్సిలర్, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి పాల్గొననున్నారు.

News March 5, 2026

యువతకు సాంకేతిక నైపుణ్యం అవసరం: కలెక్టర్ అనురాగ్ జయంతి

image

యువత సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం ఆలేరులోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC), ఐటిఐలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కోర్సుల శిక్షణను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. సృజనాత్మక ఆలోచనలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రిన్సిపల్ హరికృష్ణ పాల్గొన్నారు.

News March 5, 2026

మంత్రి, ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం!

image

AP: కృష్ణా(D) గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండైంది. HYDకు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి వెంటనే నిలిపేశారు. ఈ ఫ్లైట్‌లో మంత్రి గొట్టిపాటి రవి, MLAలు లక్ష్మీనారాయణ, పుల్లారావుతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రోడ్డు మార్గాన బయలుదేరగా ఇతరులకు వేరే విమానం ఏర్పాటు చేయనున్నట్లు ఇండిగో ప్రకటించింది.