News November 17, 2025
బిహార్ ‘మహాగురు’.. MLAగా గెలవలేకపోయారు!

బిహార్ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుడు, టాప్ మ్యాథమెటీషియన్ కృష్ణ చంద్ర సిన్హా ఓడిపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన JSP నుంచి పోటీ చేసిన ఈయనకు కేవలం 15వేల ఓట్లే వచ్చాయి. ఈయన బీఎస్సీ, ఎంఎస్సీలో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించారు. PhD పూర్తి చేశారు. గణితంపై 70 పుస్తకాలు రాశారు. బిహార్‌లో ఈయనను మహాగురు అని పిలుస్తారు. అయినా రాజకీయాల్లో రాణించలేకపోయారు.
Similar News
News March 24, 2026
సినీ పరిశ్రమ అభివృద్ధిపై CM CBNతో సంజయ్ దత్ భేటీ

AP: CM CBNతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, షూటింగ్‌లకు APని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంజయ్ దత్ వివరించారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని CM తెలిపారు.
News March 24, 2026
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ గడువు పెంచలేం: SC

AP, TGల్లో మిగిలిన 623 PG మెడికల్ సీట్ల భర్తీపై PVT కాలేజీలకు SCలో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పటికే ఏడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా గడువు కోరడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అకడమిక్ క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే దీనిపై కాలేజీలు కేంద్రాన్ని సంప్రదించొచ్చని సూచించింది. కేంద్రం మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
News March 24, 2026
ఎన్నికల వేళ కమల్ హాసన్ సంచలన ప్రకటన

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. ఇది త్యాగం కాదని, తన డ్యూటీ అని ట్వీట్ చేశారు. అయితే డీఎంకే కూటమికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా ఎన్నికల్లో కమల్ పార్టీకి డీఎంకే రెండు స్థానాలు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే కమల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.


