News November 17, 2025
ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
Similar News
News March 25, 2026
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత: కడప SP

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు SP S.నచికేత్ విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఆయన TTD JEO వీరబ్రహ్మం, TTD విజిలెన్స్ SP మురళీ కృష్ణతో కలిసి భద్రతా ఏర్పాట్ల ప్రదేశాలను పరిశీలించారు. ఒంటిమిట్ట రామాలయం, కళ్యాణ వేదిక, CM గెస్ట్ హౌస్, మాడ వీధుల్లో చేపట్టాల్సిన భద్రత విషయాలను చర్చించారు. రామయ్య కళ్యాణం రోజు సుమారు 2100 మంది పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు.

YSRకు నివాళులు అర్పించిన షర్మిల

AP కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఘాటు నందు షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పులివెందుల ఇన్‌ఛార్జ్ ధ్రువ్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు.