News April 12, 2024
ఇరాన్, ఇజ్రాయెల్‌కు ఇండియన్స్ వెళ్లొద్దు: విదేశాంగశాఖ

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. ‘తదుపరి సమాచారం ఇచ్చేవరకు ఆ దేశాలకు భారతీయులెవరూ ప్రయాణించొద్దు. ఇప్పటికే అక్కడ ఉన్నవారు ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉండాలి. తమ పేర్లను అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి’ అని కోరింది. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సూలేట్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడి చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 21, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,45,970, 22 క్యారెట్ల గోల్డ్ రూ.2,750 తగ్గి రూ.1,33,800 పలుకుతోంది. అటు వెండి కిలోపై ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,50,000కి చేరింది.
News March 21, 2026
బాంబుల మోత మధ్య పండుగ!

దూసుకొచ్చే మిస్సైళ్లు.. ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలియని బాంబులు. ఇలాంటి భయానక వాతావరణంలో ఇరాన్ సహా గల్ఫ్ దేశాలు రంజాన్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా విరుచుకుపడుతుండగా ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. దీంతో ముస్లింలు ఆనందంగా జరుపుకునే పండుగ భయం గుప్పిట్లో జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
News March 21, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

పవన్-హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.59 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు Sacnilk తెలిపింది. ఇండియాలో రూ.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.7 కోట్లు సాధించినట్లు వివరించింది. మొత్తంగా రూ.44 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. గురువారంతో పోల్చితే శుక్రవారం థియేటర్లలో షోలతో పాటు సీట్ల ఆక్యుపెన్సీ తగ్గిందని పేర్కొంది. మరి మీరు మూవీ చూశారా? ఎలా ఉంది?


