News November 17, 2025

NEEPCLలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>NEEPCL<<>>)లో 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు GATE -2025 అర్హత సాధించినవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.560. SC,ST,PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://neepco.co.in

Similar News

News March 20, 2026

ఇంటర్ వాల్యుయేషన్ వాయిదా

image

AP: రంజాన్ పండుగ సందర్భంగా ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ వాయిదా పడింది. మార్చి 21కి బదులుగా 22నుంచి వాల్యుయేషన్ స్టార్ట్ కానుందని విజయనగరం RIO తవిటినాయుడు తెలిపారు. తొలిరోజు లాంగ్వేజెస్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్, స్పెల్-1 ఒకేషనల్ పేపర్ల మూల్యాంకనం జరుగుతుంది. రెండో స్పెల్‌లో ఉండాల్సిన GFC పేపర్ల వాల్యుయేషన్‌ను కూడా 22 నుంచే నిర్వహించనున్నారు. ఈ వాయిదా ప్రభావం ఫలితాల వెల్లడిపై ఉండే అవకాశం ఉంది.

News March 20, 2026

సన్నబియ్యం పంపిణీకి రూ.7,366 కోట్లు: భట్టి

image

TG: రాష్ట్రంలో 3.38 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు బడ్జెట్లో ₹7,366CR కేటాయించినట్లు Dy CM భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనివల్ల 1.05 కోట్ల తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అలాగే 4.50L ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ₹7,430CR ప్రతిపాదించామని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.

News March 20, 2026

ధాన్యం సేకరణ కోసం రూ.22,700 కోట్లు

image

TG: యాసంగిలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ప్రభుత్వం నిధులను సిద్ధం చేసింది. దీని కోసం రూ.22,700 కోట్లను పౌరసరఫరాల సంస్థ ఖాతాలో రుణం రూపేణా జమ చేయించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాన్ని ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రుణానికి గ్యారంటీ ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యాసంగిలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 95L MT ధాన్యాన్ని సేకరించనున్నారు.