News November 17, 2025
నస్రుల్లాబాద్: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

నస్రుల్లాబాద్ మండలం దుర్కి చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు బాన్సువాడ ఏఎస్ఐ సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో డీసీఎంలో తరలిస్తున్న దాదాపు 12 టన్నుల బియ్యను పట్టుకుట్లు పోలీసులు చెప్పారు. ఈ బియ్యం హైదరాబాద్ నుంచి గాంధారి మీదుగా కోటగిరిలోని ఓ రైస్ మిల్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. డీసీఎంను నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Similar News
News March 6, 2026
సంగారెడ్డి: ఇంటి వద్దకే సీతారాముల ముత్యాల తలంబ్రాలు

శ్రీరామనవమి సందర్భంగా భక్తుల చెంతకే స్వామివారి ముత్యాల తలంబ్రాలను చేరవేసే కార్యక్రమాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ గురువారం దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆసక్తి గల భక్తులు 151 రూపాయలు చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. నేరుగా ఇంటికే తలంబ్రాలు అందేలా ఈ వినూత్న సదుపాయం కల్పించినట్లు ఆయన తెలిపారు.
News March 6, 2026
అతివలకు అండగా ఆదిలాబాద్ షీ టీం

ఆదిలాబాద్ జిల్లాలో మహిళల భద్రతకు షీ టీమ్స్ నిరంతరం సేవలందిస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత నెలలో 54 ఫిర్యాదులు స్వీకరించి, 61 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 118 హాట్‌స్పాట్‌లలో తనిఖీలు చేపట్టి 53 మంది పోకిరీలపై చర్యలు తీసుకున్నారు. “పోలీసు అక్క” ద్వారా విద్యాసంస్థల్లో అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా 8712659953 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
News March 6, 2026
ఇతనికి 60 ఏళ్లు.. నమ్ముతారా?

తన ఏజ్‌లెస్ లుక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ మోడల్ చువాండో టాన్ ఈ నెల 3న 60 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అరవైలో ఇరవైలా ఉండటమంటే ఇదేనని, ఇతను వ్యాంపైర్ అయి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హై ప్రొటీన్ ఫుడ్, మద్యం, ధూమపానం, చక్కెరకు దూరంగా ఉండటం, డైలీ వ్యాయామం, స్విమ్మింగ్ తన ఫిట్‌నెస్‌కు కారణమని అతను చెబుతుంటారు.


