News November 17, 2025

మంచిర్యాల: మహిళలు జాగ్రత్త.!

image

బైక్‌పై ప్రయాణించేటప్పుడు మహిళలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. బైక్ వెనకాల కూర్చునేటప్పుడు లేదా స్కూటీలు డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వారు ధరించిన చున్నీలు, స్కార్ఫ్‌లు, చీరలు బైక్ వీల్స్‌లో పడకుండా సరి చూసుకోవాలి. పొరపాటున అవి చక్రంలో పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. నిన్న రాత్రి గోదావరిఖనిలో వేమనపల్లికి చెందిన లత చీర కొంగు వీల్‌లో చిక్కుకొని చనిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News April 7, 2026

సిరిసిల్ల: భద్రత ప్రమాణాలు పాటించాలి

image

ప్రతి ఒక్కరు ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఆహార భద్రత ప్రమాణాలు అలాగే ఆహార నిల్వలు నిర్ణీత కాలంలో పూర్తి చేసే అంశంపై సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఆహార కల్తీ నివారించాలని, లేదంటే క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రభులే అవకాశముందని ఆయన తెలిపారు.

News April 7, 2026

మెళియాపుట్టి: పిడుగుపాటుకు ఒకరు మృతి

image

మెళియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన వినోద్ తన స్నేహితులతో కలిసి మహేంద్రగిరి దర్శనానికి సోమవారం వెళ్లారు. ఈ సమయంలో అకస్మాత్తుగా వర్షం..ఉరుములు మొదలయ్యాయి. దీంతో నలుగురు స్నేహితులు సమీపంలోని గుడిలోకి పరుగెత్తగా..చివరిగా వస్తున్న వినోద్‌పై పిడుగు పడింది. పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడిన వినోద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదైంది.

News April 7, 2026

ఎర్రగుంట్ల RTPPలో 8,323.926 MU విద్యుత్ ఉత్పత్తి.!

image

కడప జిల్లాలోని ప్రభుత్వ రంగంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8,323.926 MU విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఇక్కడ 5X210MW, 1X600MW విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. యూనిట్ల వారీగా విద్యుత్ ఉత్పత్తి వివరాలు(MUలో).
☛ U1 – 1062.648
☛ U2 – 1010.066
☛ U3 – 1080.999
☛ U4 – 972.7590
☛ U5 – 1016.253
☛ U6 – 3181.201MU విద్యుత్ ఉత్పత్తి జరిగింది.