News November 17, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో కార్తీక పూజలు

పవిత్ర కార్తీక మాసంలో 4వ సోమవారం సందర్భంగా మహానగరంలోని పలు శివాలయాలు, ఇతర దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివనామ స్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువ జాము నుంచే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Similar News
News April 3, 2026
HYDలో పెరుగుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!

హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే నమోదవుతున్నాయని టీజీడీపీఎస్ వెల్లడించింది. దుండిగల్, మౌలాలి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలుల ధాటికి నగరవాసులు అల్లాడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News April 3, 2026
TG: ఇసుక విక్రయాల ఆదాయంలో భారీ వృద్ధి

గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 3.71లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాలు జరగ్గా, రూ.1,008 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు GOVT ఇసుక మాఫియాను సమర్థంగా అరికట్టింది. గతేడాది ప్రభుత్వం రూ.738కోట్లు మాత్రమే ఆర్జించింది. స్థానికంగా ఇసుక లభ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో 17, HYD చుట్టూ 4 ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
News April 3, 2026
HYD: రూ.500 కోట్ల ఫీజులు నిలిచిపోయి సామాన్యుల తిప్పలు!

HYD శివారులోని 74 గ్రామ పంచాయతీల పరిధిలో హెచ్ఎండీఏ (HMDA), కొత్తగా ఏర్పాటైన ఎఫ్‌సీడీఏ (FCDA) మధ్య తీవ్ర అధికార పోరు సాగుతోంది. లేఅవుట్ పర్మిషన్లు, డెవలప్‌మెంట్ ఫీజుల రూపంలో వచ్చే సుమారు రూ.500 కోట్ల ఆదాయం ఎవరికి చెందాలనే దానిపై స్పష్టత లేక ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయి. రెండు సంస్థల జోక్యంతో న్యాయపరమైన చిక్కులు వస్తుండటంతో అటు పర్మిషన్లు రాక సామాన్యులు, ఇటు ఆదాయం లేక ఖజానా నష్టపోతున్నాయి.


