News November 17, 2025

సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

image

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్‌లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్‌ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

Similar News

News March 16, 2026

మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

image

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మైనర్ అని, 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని తెలిపారు. ఫర్మాన్‌ ఖాన్‌‌తో వివాహం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా <<19360382>>మరోసారి<<>> స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

News March 16, 2026

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిరి

image

కర్నూలు ఏ క్యాంప్‌లోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సోమవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతులపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామని ఏపీసీ లోకరాజు తెలిపారు. నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.

News March 16, 2026

జమ్మికుంట: రైల్వే ట్రాక్‌పై వరుస ఆత్మహత్యలు..!

image

జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో గత వారం రోజుల్లో ముగ్గురు వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే ప్రాణాలు తీసుకుంటుండడంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. క్షణికావేశంలో సులభ మార్గంగా రైల్వే ట్రాక్‌ను ఎంచుకుంటున్నారని భావిస్తున్నారు. ఇటువంటి ఘటనలు నివారించేందుకు పోలీసులు పహారా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.