News April 12, 2024
MBNR: జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ అడుగంటుతోంది

ఉమ్మడి MBNR జిల్లాకు తాగునీటిని అందిస్తున్న జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ వేగంగా అడుగంటుతోంది. ఎండల తీవ్రత కారణంగా తాగునీటి వినియోగం పెరుగుతుండగా మరో పక్క జలాశయంలో ఉన్న నిల్వ నీరు అవిరి రూపంలో తగ్గిపోతున్నట్లు సాగునీటి శాఖ అధికారులు అంటున్నారు. ఏప్రిల్ చివరి వారం వరకు ఉన్న నీటితో నెట్టుకు రావొచ్చని, మేలో తాగునీటికి కష్టాలు తప్పవని వారంటున్నారు. పాలమూరుకు నీటి కష్టం తప్పదని రైతులు వాపోతున్నారు.
Similar News
News March 10, 2026
హెచ్‌సీఏ సెక్రటరీగా పాలమూరు వాసి నియామకం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెక్రటరీగా పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే జీవన్ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఆయన తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.
News March 10, 2026
MBNR: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం – కలెక్టర్

జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని కలెక్టర్ కుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.
News March 9, 2026
MBNR: డిగ్రీ.. దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌లోని(దొడ్డలోనిపల్లి) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr.జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నూతన ఏడాదికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, నేరుగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


