News November 17, 2025

అరకు, లంబసింగిలో కారవాన్ పార్కులు

image

ఏపీలో మొదటిసారిగా అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్‌లలో కారవాన్ పార్క్‌లు ఏర్పడనున్నాయి. పర్యాటకులకు చిన్న మొబైల్ హౌస్‌లా ఉండే కారవాన్‌ల్లో సురక్షితంగా ఉండే అవకాశం కలుతుందని అధికారులు తెలిపారు. లంబసింగిలో పైలట్‌గా 10-15 ఈ-కారవాన్ వాహనాలు అందించనున్నారు. మొత్తం మూడు పార్కులకు రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టబడుతోంది. హోటల్ సౌకర్యాలు తక్కువైన ప్రాంతాల్లో ఇది కొత్త అనుభవం కానుంది.

Similar News

News November 17, 2025

AP న్యూస్ రౌండప్

image

*నిధుల దుర్వినియోగం కేసులో IPS అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను మూడోసారి తిరస్కరించిన ACB కోర్టు
*నకిలీ మద్యం కేసులో చొక్కా సతీశ్ రిమాండ్‌ను NOV 25 వరకు పొడిగింపు
*మూడు బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
*తన భార్య డిజిటల్ అరెస్టుకు గురయ్యారంటూ MLA పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన ఫిర్యాదుపై ఏడుగురిని అరెస్టు చేసిన కడప సైబర్ క్రైమ్ పోలీసులు

News November 17, 2025

జోగి రమేశ్ సోదరుల కస్టడీ పిటిషన్ వాయిదా

image

నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరుల కస్టడీ పిటిషన్లపై విజయవాడ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ విచారణను కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు వారిని 10 రోజుల కస్టడీకి కోరినట్లు సమాచారం. ప్రస్తుతం వారు నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

News November 17, 2025

MBNR: ముగిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

image

మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. స్వామివారి ఆభరణాలను ఎస్బీఐ ఆత్మకూరు శాఖ లాకర్‌లో భద్రపరిచినట్లు ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జాతర నిర్వహణకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతర అమావాస్య వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.