News November 17, 2025

ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన GWMC కమిషనర్

image

గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరార్థమై ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. GWMCలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 22, 2026

భద్రకాళి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ

image

భద్రకాళి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయ ప్రాకారాలు తెరిచారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, విశేషాలంకరణ చేశారు. అనే ప్రధాన పూజారి భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

News March 22, 2026

మూడో రోజే ₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2

image

రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ మైల్‌స్టోన్‌ని దాటింది. ఇండియాలో ₹339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా ఓవర్సీస్ మార్కెట్‌లో ₹96 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు భారీ ఆక్యుపెన్సీ లభిస్తోంది.

News March 22, 2026

WGL: గ్యాస్ కొరత.. మూతబడుతున్న హోటల్స్

image

వరంగల్‌ నగరంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్ మూతపడుతున్నాయి. నగర వ్యాప్తంగా 3 వేల చిన్న, పెద్ద హోటల్స్ ఉండగా, గ్యాస్ కొరతతో 500కు పైగా హోటల్స్ మూత పడ్డాయి. దీంతో హోటల్ వృత్తిపై ఆధారపడిన వారు ఉపాధి కోల్పోతున్నారు. చిన్న, పెద్ద హోటళ్లు రోజూ వారి వినియోగానికి 4-5 సిలిండర్లు వాడుతున్నారు. సరఫరా తగ్గడంతో రేట్లు రూ.100-150కి పెరిగాయి. కొన్ని హోటల్స్ కట్టెలు, ఊక పొయ్యిలతో నడుపుతున్నారు.