News November 17, 2025

యలమంచిలి ఎమ్మెల్యేపై పవన్ సీరియస్

image

అచ్యుతాపురం (M) దుప్పితూరు భూ వివాదంలో MLA జోక్యం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ సీరియస్ అయినట్లు సమాచారం. పార్టీకి డ్యామేజ్ చేసే వ్యవహారాల్లోకి వెళ్లొద్దని మంత్రి నాదెండ్ల ద్వారా విజయకుమార్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనవసర వ్యవహారాల్లో కలగజేసుకుని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించొద్దని పవన్ సూచించినట్లు సమాచారం. MLA నుంచి వివరణ కూడా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News April 5, 2026

పాలకోడేరులో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

image

పాలకోడేరు మండలం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి, ముఖ్యంగా విద్యారంగ పురోగతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదని ఎస్పీ కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

News April 5, 2026

హుజురాబాద్: డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గ్రామస్థుల గళం

image

హుజూరాబాద్ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాంపూర్, రంగాపూర్, కందుగుల సహా ఏడు గ్రామాల ప్రజలు ఆదివారం స్వచ్ఛందంగా సమావేశమయ్యారు. ఈ సభకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై మద్దతు తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల సాగు భూములు, చెరువులు కలుషితమై భూగర్భ జలాలు విషతుల్యమవుతాయని, నివాస ప్రాంతాలకు సమీపంలో ఇలాంటి ప్రాజెక్టులు వద్దని వారు స్పష్టం చేశారు.

News April 5, 2026

మంత్రి కొల్లు vs పేర్ని నాని.. నువ్వా నేనా అంటూ సవాళ్లు!

image

బందరులో అక్రమ కట్టడం కూల్చివేత మంత్రి కొల్లు రవీంద్ర, పేర్ని నాని మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బాధిత కుటుంబం పక్షాన నిలిచిన నాని, జగన్ వచ్చాక మీకు గుణపాఠం చెప్పకపోతే ‘నేను పేర్ని కృష్ణమూర్తి కొడుకునే’ కాదంటూ సవాల్ విసిరారు. దీనిపై మంత్రి కొల్లు ‘తండ్రి బతికుండగా కూడు పెట్టలేనోళ్లు సవాళ్లు విసురుతున్నారని’ సమాధానమిచ్చారు. దీనికి ప్రతిగా కుటుంబాలను రాజకీయాల్లోకి లాగుతున్నారని పేర్ని ఆరోపించారు.