News November 17, 2025
జగిత్యాల: EVMల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ధరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక వ్యవస్థలను ఈ సందర్భంగా ఆయన సమగ్రంగా పరిశీలించారు. గోదాములో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
గ్యాస్ దెబ్బ.. పెరిగిన టిఫిన్ల ధరలు!

ఎల్పీజీ కొరత సాకుగా చూపి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు టిఫిన్ల ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రతి ఐటమ్‌పై ప్లేట్‌కు రూ.10 పెంచినట్లు వినియోగదారులు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలిక పెంపు మాత్రమేనని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదని, ఇటీవల LPG ధర కూడా పెరగడంతో నిర్వహణ ఖర్చులు ఎక్కువైనట్లు పేర్కొంటున్నాయి. మరి మీ ఏరియాలోనూ టిఫిన్ల ధరలు పెరిగాయా? COMMENT
News March 13, 2026
నువ్వుల పంటలో బిహారీ గొంగళి పురుగులను ఎలా నివారించాలి?

నువ్వుల పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు ఆకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు జల్లెడలా మారతాయి. ఎదిగిన గొంగళి పురుగులు మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎకరాకు 16- 20 పక్షి స్థావరాలను, హెక్టారుకు ఒక దీపపు ఎరను అమర్చాలి. తొలుత లీటరు నీటికి వేపనూనె 5mlను, తర్వాతి దశలో లీటరు నీటికి క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News March 13, 2026
హార్ముజ్‌లో ముగ్గురు భారత నావికుల మృతి

హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన నౌకల్లోని ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం ధ్రువీకరించింది. మరొకరి జాడ తెలియాల్సి ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వందలాది భారతీయులతో కూడిన ఇండియన్ షిప్స్ ఉన్నట్లు తెలిపింది. వీరి భద్రతను పర్యవేక్షించేందుకు కేంద్రం 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ప్రతి నౌకను ట్రాక్ చేస్తున్నట్లు పేర్కొంది.


