News November 17, 2025
రూ.లక్ష కోట్లకు Groww

స్టాక్ బ్రోకింగ్ సంస్థ Groww పేరెంట్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో అదరగొట్టింది. వరుసగా నాలుగు రోజులు లాభాలు సాధించింది. ఇవాళ షేర్ వాల్యూ మరో 13 శాతం పెరిగి అత్యధికంగా రూ.169.79కి చేరింది. ఇష్యూ ధర రూ.100తో పోలిస్తే దాదాపు 70 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.05 లక్షల కోట్లను తాకింది.
Similar News
News March 12, 2026
శుభ సమయం (12-3-2026) గురువారం

➤ తిథి: బహుళ నవమి తె.4.14 వరకు
➤ నక్షత్రం: మూల రా.10.54 వరకు
➤ శుభ సమయాలు: ఉ.7.00-7.11, ఉ.9.09-10.07, ఉ.10.57-మ.12.07, మ.1.06-మ.2.06, సా.4.04-సా.6.03
➤ రాహుకాలం: మ.1.30-మ.3.00
➤ యమగండం: ఉ.6.00-ఉ.7.30
➤ దుర్ముహూర్తం: ఉ.10.08-ఉ.10.56, మ.2.53-మ.3.40
➤ వర్జ్యం: రా.9.07-రా.10.54
➤ అమృత ఘడియలు: మ.3.49-సా.5.35
News March 12, 2026
జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు: CM రేవంత్

TG: రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. భారీ వాహనాలను నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. NHలకు రింగు రోడ్ల అనుసంధానం, HYD-విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్ చేరేందుకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలన్నారు.
News March 12, 2026
TODAY HEADLINES

* గల్ఫ్ పరిస్థితులపై ఆందోళన చెందొద్దు: ప్రధాని మోదీ
* LPG ఉత్పత్తిని 25% పెంచాం: కేంద్రం
* ఎక్కడా గ్యాస్ కొరత లేదు: CM చంద్రబాబు
* క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు: జగన్
* ఖమ్మం భూదాన్ భూములను పేదలకే వాడతాం: భట్టి
* తెలంగాణలో మూడో డిస్కం
* లోక్‌సభ స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం
* గుజరాత్‌కు వస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. ఖండించిన భారత్
* IPL తొలి దశ షెడ్యూల్ రిలీజ్


