News November 19, 2025
విండ్రో కంపోస్టింగ్ యూనిట్‌ను పరిశీలించిన కమిషనర్, మేయర్

వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్‌పేయి, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంగళవారం బాలసముద్రంలోని విండ్రో కంపోస్టింగ్ యూనిట్‌ను సందర్శించారు. హాస్టళ్లు, హోటళ్లు, మార్కెట్ల నుంచి సేకరించిన ఆహార వ్యర్థాలతో కంపోస్ట్ తయారీకి జరుగుతున్న ట్రయల్ రన్‌ను వారు సమగ్రంగా పరిశీలించారు. పనులు మరింత వేగవంతంగా జరిగేలా సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
Similar News
News March 28, 2026
నరసరావుపేట: ప్రత్యేక పీజీఆర్ఎస్‌కు 24 ఫిర్యాదులు

నరసరావుపేటలో శనివారం ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతుల కోసం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన లభించింది. జాయింట్ కలెక్టర్ సంజనా సింహా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు 24 ఫిర్యాదులను అందజేశారు. అర్జీలను స్వీకరించిన జేసీ, వాటిని వెంటనే సంబంధిత శాఖలకు బదిలీ చేసి, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News March 28, 2026
VZM: టెన్త్ పరీక్షకు 99.72 శాతం హాజరు

జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పదో తరగతి జీవ శాస్త్రం పరీక్షకు 99.72 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా మొత్తం 22969 మంది హాజరు కావల్సి ఉండగా వారిలో 22,905 మంది హాజరయ్యారన్నారు. కేవలం 64 మంది విద్యార్ధులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.
News March 28, 2026
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, మెకానికల్ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్‌తో ఆరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8639846568 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.


