News November 17, 2025

JGTL: సింగిల్ డిజిట్‌కు చేరిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లా చలికి వణుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు చేరింది. గోవిందారంలో 9℃, గొల్లపల్లి 9.9, తిరుమలాపూర్, కథలాపూర్, మన్నెగూడెం 10, మల్లాపూర్, పెగడపల్లి 10.2, రాఘవపేట 10.4, మల్యాల 10.5, ఐలాపూర్ 10.6, మేడిపల్లె, జగ్గాసాగర్ 10.7, నేరెళ్ల 10.9, పూడూర్ 11.1, రాయికల్ 11.2, కోరుట్ల, పొలాస, గోదూరు 11.3, మద్దుట్ల, అల్లీపూర్ 11.5, జగిత్యాల, సారంగపూర్లో 11.6℃గా నమోదైంది.

Similar News

News November 17, 2025

హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

image

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్‌‌వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.

ఇతిహాసాలు క్విజ్ – 69 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: శివుడికి ‘నీలకంఠుడు’ అని ఎందుకు అంటారు?
సమాధానం: పాల సముద్రాన్ని మథించేటప్పుడు భయంకరమైన విషం వెలువడింది. దాన్ని హాలాహలం అని అంటారు. సమస్త లోకాల సంరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో (గొంతులో) ఉంచుకుంటాడు. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అలా శివుడు నీలకంఠుడు అయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>