News November 19, 2025
సిరిసిల్ల: సదరం క్యాంపుల తేదీలు ఇవే!

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపుల నిర్వహణ తేదీలను మంగళవారం ప్రకటించారు. ఈ నెల 24, 25న మానసిక, 25అర్థో, 26 వినికిడి సమస్యలు, 27 జనరల్, 29 కంటి చూపు సంబంధించిన సమస్యలు ఉన్నవారు శిబిరానికి హజరుకావాలన్నారు. దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఫొటోలు తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.
Similar News
News March 18, 2026
నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమకు ఏర్పాటు సన్నాహాలు

జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం నిజామాబాద్ పట్టణంలో అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాకు ఆయిల్ పరిశ్రమ మంజూరు చేసేందుకు CM రేవంత్ రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు. అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
News March 18, 2026
కేంద్ర మంత్రిని కలిసిన రోజా

నగరి నియోజకవర్గ సమస్యలను కేంద్రమంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాన్ని తొలగించేలా చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుపోయారు. కొండచుట్టూ మండప ప్రాధాన్యాన్ని తెలియజేసి, వాటిని కాపాడేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.
News March 18, 2026
తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ డెలివరీలు

తెలంగాణలో మంగళవారం (మార్చి 17న) రికార్డు స్థాయిలో 2,35,678 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఇది సాధారణ సగటు సరఫరా (2.15 లక్షలు) కంటే ఎక్కువ. భారత్ పెట్రోలియం 57,635 (+22.63%), HP 84,156 (+11.98%), ఇండేన్ 93,887 (+1.00%) వృద్ధిని నమోదు చేశాయి. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత ఉందన్న వదంతులను నమ్మి ‘పానిక్ బుకింగ్’ చేయొద్దని పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది.


