News April 12, 2024

జగన్ హంతకులను కాపాడుతున్నారు: షర్మిల

image

AP: జగన్ జైలుకు వెళ్తే 3200KM తాను పాదయాత్ర చేశానని షర్మిల వెల్లడించారు. పులివెందుల పూల అంగళ్లు సెంటర్‌లో కాంగ్రెస్ న్యాయయాత్రలో మాట్లాడిన ఆమె.. ‘రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌కు వివేకా అలాగే. అలాంటి నేతను చంపితే ఐదేళ్లయినా న్యాయం జరగలేదు. అధికారం ఉపయోగించి జగన్ హంతకులను కాపాడుతున్నారు. CBI సాక్ష్యాధారాలు బయటపెట్టింది. నేను ఎవరికీ భయపడను. పులి కడుపున పులే పుడుతుంది.’ అని స్పష్టం చేశారు.

Similar News

News January 23, 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో కాస్త తడబడ్డప్పటికీ కాసేపటికే పుంజుకున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 82,425 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 25,313 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో TCS, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్ షేర్లు లాభాల్లో.. ఇండిగో, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News January 23, 2026

Republic day Special:కమలాదేవి చటోపాధ్యాయ

image

కమలాదేవి చటోపాధ్యాయ సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. 1923లో మహాత్మాగాంధీ పిలుపు అందుకుని సహాయ నిరాకరణ ఉద్యమ సేవాదళ్‌ సంస్థలో పనిచేశారు. విదేశాల్లో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితిగతులు, విద్యాసంస్థలు తదితరాలను పరిశీలించారు. గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930, జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని పోలీసులు అడ్డుకున్నా, ఎగురవేసిన సాహస నారి కమలాదేవి.

News January 23, 2026

కోడి పిల్లలను వదిలాక షెడ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్ల షెడ్‌లో ప్రతి 50 కోడి పిల్లలకు ఒక మేత తొట్టి, నీటి తొట్టి అమర్చాలి. తొలి వారంలో 50 పిల్లలకు 24 అంగుళాల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు కింద 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి నీటితో నింపాలి. కోడి పిల్లలను ఉంచిన షెడ్‌లో రాత్రంతా లైట్లను ఆన్‌లో ఉంచాలి. కోడి పిల్లలకు తొలి 7-10 రోజుల మధ్య ముక్కును కత్తిరిస్తే అవి ఒకదానినొకటి పొడుచుకోవడం, తొట్లలో మేతను కిందకు తోయడం తగ్గుతుంది.