News November 19, 2025
సెరామిక్ పాత్రలతో ప్రయోజనం..

ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఫుడ్డే కాదు వాడే పాత్రలూ ముఖ్యమే. అల్యూమినియం, ఇత్తడి, నాన్ స్టిక్ వల్ల అనారోగ్యం వస్తుందంటున్నారు నిపుణులు. వీటిబదులు సెరామిక్ వాడటం మంచిది. దీంట్లో రసాయనాల కోటింగులు ఉండవు. పుల్లటి పదార్థాలు వండినా రుచి, పరిమళాల్లో మార్పు రాదు. సిలికాన్‌తో రూపొందిన సెరామిక్ జెల్ నాన్‌స్టిక్‌గా పనిచేస్తుంది. ఇవి అత్యధిక ఉష్ణోగ్రతలోనూ సురక్షితంగా ఉంటాయి. శుభ్రపరచడం కూడా చాలా సులువు.
Similar News
News March 19, 2026
FLASH: త్వరలో ఉప్పల్ రింగ్ రోడ్డు బంద్!

ఉప్పల్ రింగ్ రోడ్డు త్వరలో బంద్ కానుంది. రామంతపూర్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ హైవే వైపు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనుల్లో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు సెంటర్లో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం పూర్తిగా స్టడీ చేసింది. త్వరలోనే రింగ్ రోడ్డు బంద్ చేసి, ట్రాఫిక్ మళ్లింపులు చేసి, కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు.
News March 19, 2026
రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్

TG: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ఏడాది రైతు నామ సంవత్సరంగా ఉండబోతోందని చెప్పారు. ఉగాది వేడుకల్లో మాట్లాడుతూ ‘అన్నదాతలకు ₹2లక్షల వరకు రుణమాఫీ చేశాం. భూభారతితో భూమి సమస్యలను పరిష్కరిస్తున్నాం. రైతు భరోసాకు ₹18వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఈ నెల 22న మరో విడత డబ్బులు రిలీజ్ చేయనున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.
News March 19, 2026
IPL కోసం ఆల్కహాల్ మానేశా: చాహల్

6 నెలలుగా ఆల్కహాల్ మానేసినట్లు డివిలియర్స్ పాడ్‌కాస్ట్‌లో యుజ్వేంద్ర చాహల్ వెల్లడించారు. 35 ఏళ్ల వయసులో తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుని IPLలో టీమ్ కోసం 150% శ్రమించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత సీజన్‌లో గాయాలతో ఇబ్బంది పడటం తనను నిరాశపర్చిందన్నారు. అందుకే ఈసారి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహిస్తున్నానని, పంజాబ్ కింగ్స్‌లో సీనియర్ ప్లేయర్‌గా రోల్ మోడల్‌గా ఉండాలనుకుంటున్నట్లు వివరించారు.


