News November 19, 2025

పోక్సో కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష: ASF SP

image

మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన, అత్యాచారయత్నం కేసులో కోర్టు నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.12,000 జరిమానా విధించినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. 2020లో బెజ్జూర్‌లో జరిగిన ఈ ఘటనపై నమోదు చేసిన కేసును ప్రత్యేక కోర్టు పరిశీలించి నిందితులకు శిక్ష విధించిందన్నారు.

Similar News

News March 14, 2026

కామారెడ్డి: ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం హాజరు

image

కామారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొత్తం 1,738 మంది విద్యార్థులకు గాను 1,588 మంది హాజరు కాగా, 150 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు పకడ్బందీగా, నిబంధనల ప్రకారం జరిగాయని ఆయన వివరించారు.

News March 14, 2026

ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ రాజబాబు శనివారం తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, గ్యాస్ కొరత సృష్టించినా, అక్రమ నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఏర్పడితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 1077 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వినియోగదారులకు సూచించారు.

News March 14, 2026

MHBD: పరీక్ష కోసం తల్లిదండ్రుల మరణ వార్తను దాచారు!

image

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గన్యచక్ర తండాకు చెందిన <<19379355>>సోములు, మంగమ్మ దంపతులు HYD పటాన్‌చెరులో హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. కాగా హత్యకు గురైన తల్లిదండ్రుల విషయం తెలిస్తే బాలిక పరీక్షపై ప్రభావం పడుతుందని భావించిన గ్రామస్థులు, పరీక్ష పూర్తయ్యే వరకు విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. పరీక్ష ముగించుకుని ఇంటికి వచ్చిన బాలికకు విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యింది.