News November 19, 2025

పనులు త్వరగా పూర్తి చేయాలి: దీపక్ తివారి

image

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని ASF జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ, విద్య, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు, వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

Similar News

News March 22, 2026

హన్మకొండ: 11 మందిలో గెలిచింది ఒక్కడే!

image

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ పోటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 11 మంది న్యాయవాదులు బరిలో నిలిచారు. ఇందులో సీనియర్ న్యాయవాది ఎం సహోదర రెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో న్యాయవాది సహోదర్ రెడ్డి 1085 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. సహోదర్ రెడ్డి విజయంతో వరంగల్ కోర్టులో సంబరాలు నెలకొన్నాయి.

News March 22, 2026

ఈ గ్రామంలో వర్షమే కురవదు!

image

యెమెన్‌లోని అల్ హుతైబ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత వింతైన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల ఎత్తున పర్వత శిఖరంపై ఉండటం వల్ల ఇక్కడ అసలు వర్షమే కురవదు. మేఘాలన్నీ ఈ గ్రామం కంటే తక్కువ ఎత్తులోనే ఏర్పడటం వల్ల వర్షం పడదు. అందుకే దీనిని ‘డ్రై సిటీ’ అని పిలుస్తారు. ఇక్కడ మేఘాలు చేతికి తాకే ఎత్తులోనే ఉండటం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 22, 2026

నంద్యాల: పాడి రైతులకు భారంగా వరి గడ్డి

image

నంద్యాల జిల్లాలో వరి గడ్డి ధరలు చుక్కలనంటుతుండటంతో పశుపోషకులు బెంబేలెత్తుతున్నారు. నిన్నటి వరకు రూ.10 వేలు పలికిన ట్రాక్టర్ గడ్డి, ప్రస్తుతం మార్కెట్ కొరత సాకుతో ఏకంగా రూ.14,500 కు చేరింది. పెరిగిన మేత ఖర్చులతో పశుపోషణ భారమై, పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఖర్చులు భరించలేక పాడి పశువులను విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.