News November 19, 2025

HNK: లోన్ యాప్ వేధింపులు.. యువకుడి సూసైడ్

image

హనుమకొండ టీవీ టవర్ కాలనీకి చెందిన నవీన్ అనే యువకుడు లోన్ యాప్ వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైనాకు చెందిన యాప్‌లో లోన్ తీసుకొని చెల్లించకపోవడంతో, అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్, వేధింపులు తట్టుకోలేక వడ్డేపల్లి-దేవన్నపేట మధ్యలోని బావిలో దూకి బలవన్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 7, 2026

ప్రొద్దుటూరులో బంగారు ధరలు ఇలా..!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,900లుగా నమోదైంది. 22 క్యారెట్ బంగారం గ్రాము రూ.14,628, వెండి 10 గ్రాములు రూ.2,736 చొప్పున విక్రయిస్తున్నారు.

News March 7, 2026

సంగారెడ్డి: ‘మోదీ పాలనలో పెరిగిన మహిళలపై వేధింపులు’

image

కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలనలో మహిళలపై వేధింపులు పెరిగాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య విమర్శించారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. సోషలిస్టు పాలనతోనే మహిళలకు భద్రత ఉంటుందని చెప్పారు. ఎన్ని చట్టాలు చేసినా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

News March 7, 2026

హెయిర్ కట్ సరిగా చేయలేదని ₹25లక్షల ఫైన్

image

హెయిర్ కట్‌లో పొరపాటు భారీ మూల్యం చెల్లించేలా చేసింది. 2018లో ఓ మోడల్ హెయిర్ కట్ కోసం ముంబై ITC హోటల్ సెలూన్‌కు వెళ్లింది. స్టైలిస్ట్ చేసిన వర్క్ ఆమెకు నచ్చలేదు. దీంతో తాను మానసికంగా కుంగి మోడలింగ్, ఇంటర్వ్యూ అవకాశాలు కోల్పోయానని కన్జూమర్ ఫోరంలో కంప్లయింట్ చేసింది. కమిషన్ 2021లో ₹2కోట్ల పరిహారం ప్రకటించగా, ITC సుప్రీంకు వెళ్లింది. దీంతో తీర్పు రివైజ్ చేస్తూ ₹25 లక్షలు ఇవ్వాలని SC ఆదేశించింది.