News November 19, 2025
ములుగు: హిడ్మా దళంలో ఆరుగురేనా..?

పోలీస్ బలగాలను ముప్పతిప్పలు పెట్టిన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హిడ్మా పేరు తెలియని వాళ్లు లేరు. అయితే మోస్ట్ వాంటెడ్, రూ. కోటి రివార్డుతో పాటు, సీసీ కమిటీ మెంబర్‌గా ఉన్న హిడ్మా మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కర్రెగుట్టల ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న హిడ్మా దళంలో కేవలం ఆరుగురు ఉండడం గమనార్హం.
Similar News
News March 15, 2026
రాజంపేట RTC బస్టాండ్‌లో ప్రయాణికుల తిప్పలు

తిరుపతి వెళ్లడానికి ఆదివారం సాయంత్రం బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. 2 గంటల సేపు వేచిఉన్న తర్వాత వేరే డిపో బస్సు వచ్చిందన్నారు. అది కూడా అధిక ప్రయాణికులతో నిండుగా రావడంతో సీట్లు లేక నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజంపేట డిపో నుంచి తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, శ్రీశైలానికి రాత్రి పూట లగ్జరీ/ఏసీ బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

జమ్మికుంట మార్కెట్ రేపు తిరిగి ప్రారంభం

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ 2 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, నేడు సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకొచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటలలోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నారు.