News November 19, 2025
గ్రేటర్ తిరుపతి ఇలా..!

తిరుపతి కార్పొరేషన్ విస్తరణలో భాగంగా 63 గ్రామాలు విలీనం కానున్నాయి. తిరుపతి రూరల్ మొత్తం కార్పొరేషన్‌లో కలిపేస్తారు. చంద్రగిరి మండలంలోని 21 గ్రామాల్లో 13 గ్రేటర్‌లో కలుస్తాయి. విలీనంతో నగర జనాభా 4.52 లక్షల నుంచి 7.86 లక్షలకు చేరనుంది. ఆదాయం సైతం రూ.149 కోట్ల నుంచి రూ.192.20 కోట్లకు చేరే అవకాశముంది. ప్రస్తుతం తిరుపతి విస్తీర్ణం 30.174 చ.కిమీ ఉండగా విలీనంతో 300.404 చ.కిమీకు పెరగనుంది.
Similar News
News March 5, 2026
పార్వతీపురం: ఇంటర్ బోటనీ పరీక్షకు 392 మంది గైర్హాజరు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోటనీ పరీక్షకు 392 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DVEO నాగేశ్వరరావు గురువారం తెలిపారు. జనరల్ విద్యార్థులు 2282 మందికి 63 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2914 మందికి గానూ 329 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5196 మంది విద్యార్థులకు 392 మంది గైర్హాజరు అయ్యారని అన్నారు
News March 5, 2026
పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులను ఒకరోజు ముందుగానే పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.
News March 5, 2026
విశాఖ: కొత్త రైల్వే జోన్.. సిబ్బంది విభజనలో చిక్కులు

విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో ఉద్యోగుల విభజన వివాదంగా మారుతోంది. దక్షిణ మధ్య రైల్వే నుంచి 259 అకౌంట్స్, 699 ఇతర పోస్టులను HRMS ద్వారా బదిలీ చేశారు. అయితే సీనియారిటీ కోల్పోతామనే భయంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ హద్దుల మార్పులతో 2,000 మంది ప్రభావితం కానున్నారు. జోన్ ప్రధాన కార్యాలయానికి చెందిన 279 మంది ‘రివర్స్ ఆప్షన్’ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


