News November 19, 2025
ఖైదీని మార్చిన పుస్తకం!

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.
Similar News
News March 7, 2026
మధ్యవర్తిత్వానికి ముందుకొస్తున్నారు.. కానీ: ఇరాన్ అధ్యక్షుడు

మిడిల్ఈస్ట్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని దేశాలు మధ్యవర్తిత్వానికి ముందుకొస్తున్నాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజ్‌కియాన్ వెల్లడించారు. తాము శాంతికి కట్టుబడి ఉన్నామని.. కానీ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు వెనుకాడబోమన్నారు. మధ్యవర్తిత్వం వహించాలనుకుంటున్న దేశాలు యుద్ధం ప్రారంభించిన దేశాలపై దృష్టిసారించాలని సూచించారు. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ తగ్గితే కానీ తాము తగ్గబోమని హింట్ ఇచ్చారు.
News March 7, 2026
‘బ్లూ స్పారో’తోనే ఖమేనీ మృతి!

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ ‘బ్లూ స్పారో’ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇది 1900 కిలోల బరువు ఉంటుంది. సాధారణంగా మిస్సైళ్లు టార్గెట్స్ చేరేందుకు ఓ నిర్దిష్టమైన యాంగిల్‌లో ప్రయాణిస్తాయి. కానీ ఈ బ్లూ స్పారో ముందు దాదాపు అంతరిక్షానికి చేరి ఆపై నిటారుగా శబ్దం కంటే ఎన్నోరెట్లు వేగంతో లక్ష్యంవైపు దూసుకొస్తుంది. డిఫెన్స్ సిస్టమ్స్ కనిపెట్టేలోపే చేయాల్సిన నష్టం చేసేస్తుంది.
News March 7, 2026
భారత్ భద్రతలో సేఫ్‌గా ఇరాన్ షిప్

IRIS <<19299071>>దేనా<<>> దాడికి గురైన నేపథ్యంలో భారత్ ఆ నౌకకు ఆశ్రయం కల్పించాల్సిందనే విమర్శలు వచ్చాయి. కానీ నిజానికి భారత్ ఇరాన్‌కు సహకరిస్తూనే ఉంది. ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న IRIS లవన్ అనే మరో నౌక ఇప్పుడు కొచ్చి పోర్టులో సేఫ్‌గా ఉంది. ఇరాన్‌పై US దాడి చేసిన రోజునే (Feb 28) 183 మంది సిబ్బంది గల ఈ నౌక సంకేతిక సమస్యల వల్ల భారత్ సాయం కోరింది. దేనా విషయంలో కేంద్రానికి ఇరాన్ ఎలాంటి రిక్వెస్ట్ చేయనట్లు తెలుస్తోంది.


