News April 12, 2024

తూ.గో.: ఆ పండ్లకు ఫుల్ డిమాండ్.. 

image

వేసవి నేపథ్యంలో సీజనల్ పండ్లకు గిరాకీ పెరిగింది. ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రధానంగా పుచ్చకాయల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాజానగరం, దివాన్ చెరువు, రావులపాలెం, అమలాపురం, కాకినాడల్లోని ఉపకేంద్రాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 2టన్నుల మేర పండ్ల అమ్మకాలు సాగుతుండగా రూ.కోట్లలో టర్నోవర్ లభిస్తోంది. సపోటా, రామాఫలం, గులాబీ జామ్, చింతకాయలపల్లి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

Similar News

News April 1, 2026

రాజమండ్రి: రబీ ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం- కలెక్టర్

image

రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 256 పీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజుకు 30వేల టన్నుల ధాన్యం రవాణా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కామన్ గ్రేడ్ ధాన్యానికి ₹2,369, గ్రేడ్-ఏ రకానికి ₹2,389గా ధర నిర్ణయించామని, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News April 1, 2026

టెక్నాలజీలతో కేసులను దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ

image

టెక్నాలజీని వినియోగించి కేసుల దర్యాప్తున వేగవంతం చేయాలని తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, డీపీఓకు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో మాట్లాడి ఆరా తీశారు.