News November 19, 2025
పార్వతీపురంలో యాక్సిడెంట్.. టీచర్ మృతి

పార్వతీపురం-నర్సిపురం మధ్యలో ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో టీచర్ మృతి చెందారు. నర్సిపురం హైస్కూల్‌లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తోన్న మరిశర్ల వెంకటనాయుడు విధుల నుంచి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రక్తపు మడుగుల్లో ఉన్న అతనిని తోటి వాహనదారులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 5, 2026
నల్గొండ: మళ్లీ 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ

NLG జిల్లాలోని 5,38,650 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, రాబోయే CMR సేకరణకు స్థలం కేటాయించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 1,051 రేషన్ షాపులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 5, 2026
బెంబేలెత్తుతున్న శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఈనెల 1న దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. బుధవారం పుట్టపర్తి మండలంలో 35.21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ధర్మవరం, కదిరి మండలాల్లో 34.21, హిందూపురం మండలంలో 34.19 డిగ్రీలు నమోదయ్యాయి.
News March 5, 2026
సంగారెడ్డి: తాను మరణించి ఆరుగురికి ప్రాణం పోశారు!

తాను మరణించిన ఆరుగురికి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబాదాస్ ప్రాణం పోశారు. అమీన్‌పూర్ బృందావన్ టీచర్స్ కాలనీలో ఉంటున్న అంబాదాస్(63) అధిక రక్తపోటుతో బాధ పడేవారు. ఫిబ్రవరి 28న ఒక్కసారిగా కుప్పకూలగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చి 3న బ్రెయిన్ డెడ్ కావడంతో ఆర్గాన్స్‌ను డొనేట్ చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారు. కుటుంబ నిర్ణయం స్ఫూర్తిదాయకం అని సజ్జనార్ ట్వీట్ చేశారు.


