News November 19, 2025

పొగమంచు తీవ్రత.. అనవసర ప్రయాణాలు వద్దు: ఎస్పీ

image

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్నందున, రాత్రి, తెల్లవారుజామున అవసరం ఉంటే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ప్రజలకు సూచించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా, ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

Similar News

News March 13, 2026

‘పారాక్వాట్ డైక్లోరైడ్’ గడ్డి మందును నిషేధించాలి: ఎంపీ వద్దిరాజు

image

“పారాక్వాట్ డైక్లోరైడ్”గడ్డి మందును నిషేధించాలని కోరుతూ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వినతి పత్రం ఇచ్చారు. గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల వచ్చే అనర్థాల గురించి మంత్రికి వివరించారు. విషపూరితమైన ఈ గడ్డి మందును ఒక చుక్క మింగినా ప్రాణాలు పోతున్నాయన్నారు. దీనికి విరుగుడు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 70 దేశాలు ఈ మందులు నిషేదించాయని, ఇండియాలో కూడా నిషేధించాలని కోరారు.

News March 13, 2026

కృష్ణాజిల్లాలో రేపు సెలవు రద్దు

image

కృష్ణా జిల్లాలోని విద్యా సంస్థలకు ఈ నెల 14న రెండో శనివారం శెలవు రద్దు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు గురువారం తెలిపారు. మొంథా తుపాన్ సమయంలో కాంపస్ శాటరీ శెలవుల దృష్ట్యా ఈ శనివారం పాఠశాలలకు శెలవు దినం రద్దు చేసినట్లు వివరించారు. ఆ రోజు అన్ని విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని డీఈఓ కోరారు.

News March 13, 2026

గుంటూరు: ఈ నంబర్‌తో పోలీస్ సేవలు..!

image

గుంటూరు జిల్లా ప్రజలు మన మిత్ర – వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని సందేశం పంపితే FIR కాపీ, కేసు స్థితి, ఈ-చలానా వివరాలు వంటి పోలీస్ సేవలు మొబైల్‌లోనే పొందవచ్చన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930, అత్యవసర పోలీస్ సహాయానికి 112 కు కాల్ చేయాలని సూచించారు.