News November 19, 2025
VKB: ‘డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు’

యువత డ్రగ్స్ మహమ్మారిన పడి నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వర్ణ కుమారి తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థి దశలో డ్రగ్స్‌కు అలవాటు పడితే పూర్తిగా జీవితం చిన్న భిన్నం అవుతుందని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.
Similar News
News March 17, 2026
తిరుపతిలో గరుడ వారధిపై ఇద్దరు యువకుల మృతి

బిహార్‌కు చెందిన ఉమేష్ కుమార్(35), తరుణ్(36) తిరుపతిలోని పవర్ టెక్ ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరూ స్కూటీపై వస్తూ గరుడ వారధిపై బ్లిస్ సర్కిల్ వద్ద డివైడర్ ఢీకొని రోడ్డుపై పడిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉమేష్ కుమార్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతూ తరుణ్ కుమార్ సోమవారం కన్నుమూశాడు. బంధువుల ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేశారు.
News March 17, 2026
బెంగాల్‌లో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదు: మమతా బెనర్జీ

బెంగాల్‌లో BJPకి గతం కంటే ఈసారి సీట్లు తగ్గుతాయని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఆటలాడినా ఆ పార్టీకి ఏ మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ‘బెంగాల్’ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదని ఎద్దేవా చేశారు. కాగా WBలో మొత్తం 294 సీట్లకు గాను TMC 291 చోట్ల పోటీ చేస్తోంది. 3 సీట్లను మిత్రపక్షం BGPMకు కేటాయించింది.
News March 17, 2026
చీరాల: అత్యాచారం కేసులో నిందితుడికి జైలు

చీరాల నియోజకవర్గం వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచార కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. వేటపాలెం మండలానికి చెందిన 7 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడిన పిట్ల సూరిబాబుకు న్యాయస్థానం 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5000ల జరిమానా విధించిందన్నారు. బాధితురాలికి రూ.75,000ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని వివరించారు.


