News November 19, 2025

రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు: మంత్రి తుమ్మల

image

తెలంగాణ ప్రభుత్వంతో జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ చర్చలు సఫలం అయ్యాయని, రాష్ట్రంలో తక్షణమే 83 కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిన్నింగ్ మిల్లుల డిమాండ్లను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పత్తి రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని మంత్రి ఈ సందర్భంగా కోరారు.

Similar News

News March 5, 2026

సంగారెడ్డి: యువతి MISSING.. కేసు నమోదు

image

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి చిట్కుల్ లక్ష్మీనగర్ కాలనీకి చెందిన యువతి (19) సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కాలేజీకి వెళ్తానని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 5, 2026

సూర్యాపేట: నిమ్మ తోటలకు తెగుళ్లు.. ఆందోళనలో రైతులు

image

సూర్యాపేట జిల్లాలో నిమ్మ తోటలకు వేరుకుళ్లు, తామర పురుగు, గజ్జి తెగుళ్లు ఆశించాయి. ఆకులు, కాయలు రాలిపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయి. జిల్లాలో 8,200 ఎకరాల్లో నిమ్మ సాగు ఉండగా, ఒక్క నడిగూడెం మండలంలోనే 2,500 ఎకరాలు ఉన్నాయి. తెగుళ్ల నివారణపై మార్గదర్శకాలు లేక, అటు దిగుబడి.. ఇటు ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

News March 5, 2026

POLYCET: ఉమ్మడి వరంగల్‌లో 1,620 సీట్లు!

image

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘పాలిసెట్-2026’ దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,620 సీట్ల భర్తీకి ఏప్రిల్ 20 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. మే 13న పరీక్ష జరగనుండగా, పదో తరగతి విద్యార్థులు ఎస్‌బీటీఈటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.