News November 19, 2025
అన్నదాత సుఖీభవ, ధాన్యం సేకరణపై జేసీ సమీక్ష

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల రెండో విడత నగదు జమ, ఖరీఫ్ ధాన్యం సేకరణపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం భీమవరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారి సూచనల మేరకు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు కలిపి రూ.7 వేలు జమ అవుతాయని తెలిపారు.
Similar News
News March 10, 2026
ప.గో: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. చివరకు..

మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, బూతు మాటలతో దూషిస్తున్న మల్లవరపు యేసుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామంలోని మహిళలు పంట బోదే వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఆ సమయంలో యేసు అక్కడకి చేరుకొని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు మొగల్తూరు పోలీసులకు పిర్యాదు చేయగా ఎస్సై జి.వాసు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
News March 10, 2026
ప.గో: నెల రోజుల పాటు రక్తదాన మహోత్సవం

ప.గో. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలను విస్తరించేందుకు నిధుల సేకరణ చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం రక్తదాన మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో మానవతా సేవలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యమని జేసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News March 9, 2026
భీమవరం: ఆ 10 ఫిర్యాదులపై తక్షణ చర్యలు

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి 10 అర్జీలను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి. అందిన అర్జీలపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.


