News November 17, 2025

పల్నాడు మహిళా పౌరుష స్ఫూర్తి.. మగువ మాంచాల

image

పల్నాడు మహిళల్లో నేడు కనిపిస్తున్న పౌరుషం, ఆత్మగౌరవానికి ప్రతీకగా మగువ మాంచాలని భావిస్తారు. నాటి పల్నాటి యుద్ధంలో మాచర్ల మహామంత్రి బ్రహ్మనాయుడు కోడలిగా, మహావీరుడు బాలచంద్రుడు భార్యగా ఆమె పాత్ర కీలకమైంది. ఆత్మాభిమానం గల మహిళగా ఆమె తన భర్త బాలచంద్రుడికి వీర తిలకం దిద్ది కథన రంగానికి పంపింది. యుద్ధంలో వీరోచితంగా పోరాడి బాలచంద్రుడు అసువులు బాసినప్పటికీ ఆమె చూపిన తెగువ నేటికీ కీర్తించబడుతోంది.

Similar News

News November 17, 2025

ఆన్‌లైన్ మోసాలపై పోలీసుల సూచనలివే..

image

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు సూచించారు. తెలియని కాల్స్, ఇమెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ OTP, PIN, CVV అడగరని తెలిపారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దన్నారు. TeamViewer, AnyDesk వంటి రిమోట్ యాప్‌లు ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. ఒక్క నిర్లక్ష్యంతో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ములుగు: డబ్బుల కోసం జరిగిన గొడవలోనే సమ్మయ్య హత్య

image

డబ్బుల కోసం జరిగిన గొడవలోనే సమ్మయ్య హత్యకు గురైనట్లు ములుగు సీఐ సురేశ్ తెలిపారు. ములుగు మండలం లాలాయిగూడెంలో ఎలక్ట్రిషన్ సమ్మయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. సీఐ తెలిపిన వివరాలు.. ఇదే గ్రామానికి చెందిన సల్లూరి పవిత్ర సమ్మయ్యకు డబ్బులు ఇవ్వాలి. ఈ విషయమై వచ్చిన అతడితో పవిత్ర, ఆమె తాత సాంబయ్య, మరో మహిళ అనసూయ గొడవ పడి చంపేశారు. మృతుడి సోదరుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.