News November 19, 2025
GWL: కృషి పట్టుదల ఉంటేనే విజయం వరిస్తుంది- ప్రియాంక

విద్యార్థుల్లో కృషి పట్టుదల ఉంటే విజయం దానంతట అదే వరిస్తుందని గద్వాల జిల్లా ఉపాధి కల్పన అధికారి డాక్టర్ ప్రియాంక పేర్కొన్నారు. కలెక్టర్ సంతోష్ ఆదేశంలో భాగంగా మంగళవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మోటివేషన్, కెరీర్ గైడెన్స్ శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని, సరైన విద్యా మార్గాలు ఎంచుకొని, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు పొందవచ్చని వివరించారు.
Similar News
News March 7, 2026
HYD: అడ్వర్టైజమెంట్లపై కొత్త రూల్స్..!

HYD నగర సౌందర్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ‘అవుట్‌డోర్ అడ్వర్టైజమెంట్ పాలసీ-2026’ని అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రతి హోర్డింగ్‌కు అడ్వర్టైజమెంట్ రెగ్యులేటరీ కమిటీ (ARC) అనుమతితో పాటు క్యూఆర్ కోడ్, జియో-ట్యాగింగ్ తప్పనిసరి. వారసత్వ కట్టడాలు, విద్యాసంస్థల వద్ద ప్రకటనలపై ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు లేకుండానే తొలగించడమే కాకుండా, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.
News March 7, 2026
MBNR: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

స్వల్ప గొడవ విషయంలో తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం నవాబుపేట మండలం గురుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గణేష్ (21) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. హోలీ వేడుకల్లో స్నేహితులతో గొడవపడటంతో ఇంటి పెద్దలు మందలించారు. దీనిని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
News March 7, 2026
క్యాన్సర్‌ను ఓడించి UPSC విజేతగా రైతు బిడ్డ

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సంజయ్ దహారియా UPSC 2025 ఫలితాల్లో 946వ ర్యాంకుతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. రైతు బిడ్డ అయిన ఆయన ఆరేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడారు. ఈ క్రమంలో చూపు మందగించింది. అయినా వెనకడుగు వేయలేదు. రెండుసార్లు ఫెయిల్ అయినా పట్టు వదలకుండా 38 ఏళ్ల వయసులో UPSC ర్యాంకు సాధించారు. 3 ఉద్యోగాలకు రాజీనామా చేసి, అనారోగ్యాన్ని జయించి సాగించిన ఈ జర్నీ అనేక మందిని ఇన్‌స్పైర్ చేస్తోంది.


