News April 12, 2024
పొరపాట్లు చేశాం.. సరిదిద్దుకుంటాం: KTR

TG: రాష్ట్ర రాజకీయాలు మరో దశాబ్దం పాటు KCR చుట్టూనే తిరుగుతాయని KTR విశ్వాసం వ్యక్తం చేశారు. ’20 ఏళ్లుగా KCR చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. మా ప్రభుత్వంలో తెలంగాణను నం.1గా నిలబెట్టాం. అధికారంలో కొన్ని పొరపాట్లు చేశాం. సరిదిద్దుకుంటాం. రైతుబంధు, దళితబంధు, కార్యకర్తల విషయంలో పొరపాట్లు గుర్తించలేకపోయాం. స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తాం’ అని వెల్లడించారు.
Similar News
News March 21, 2026
యుద్ధం.. ఇరాన్‌కు లాభాలు!

యుద్ధం వల్ల ఇరాన్‌కు నష్టాలతో పాటు లాభాలూ కలుగుతున్నాయి. గత 40 ఏళ్లుగా క్రూడాయిల్ అమ్మకుండా ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం తలెత్తడంతో అమెరికా దిగివచ్చి వాటిని ఎత్తివేసింది. ఆయిల్ అమ్ముకోవచ్చంది. ఇక హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే షిప్పులకు గతంలో ఎలాంటి ఫీజు లేకపోయేది. ఇప్పుడు ఇరాన్ ఒక్కో నౌకకు ఆయిల్ ట్యాంకర్ కంపెనీల నుంచి 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తోంది.
News March 21, 2026
‘ధురంధర్-2’పై దీపిక సైలెన్స్ ఎందుకు?

‘ధురంధర్-2’పై రణ్‌వీర్ భార్య, హీరోయిన్ దీపికా పదుకొణె స్పందించకపోవడంపై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. భర్త విజయాలను అభినందించడంలో ముందుండే ఆమె ఈసారి ప్రీమియర్లకూ దూరంగా ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధురంధర్ ఫస్ట్ పార్ట్‌కు ఇన్‌స్టాలో ప్రశంసించిన దీపిక ఇప్పుడు SM సైలెన్స్ వెనక రీజన్ ఏంటా అని చర్చించుకుంటున్నారు. కాగా దీపిక ఇటీవల రణ్‌వీర్ తల్లి, సోదరితో ముంబైలోని ఓ కన్సర్ట్‌లో మెరిశారు.
News March 21, 2026
‘భగీరథ ప్రయత్నం’ అంటే?

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడాన్ని ‘భగీరథ ప్రయత్నం’ అంటారు. పూర్వం కపిల మహర్షి కోపాగ్నికి ‘సగర’ వంశస్థులు భస్మమవుతారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చడానికి భగీరథుడు చేసిన తపస్సుకు గంగా దేవి మెచ్చారు. కానీ తన వేగాన్ని భూమి తట్టుకోలేదని చెప్పడంతో శివుడి కోసం ప్రార్థిస్తారు. ఆయన గంగను జటాజూటంలో బంధించి భూమిపైకి వదులుతారు. భగీరథుడిని అనుసరిస్తూ గంగ వెళ్లి సగరల బూడిదను తాకి మోక్షం కలిగిస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>


