News November 19, 2025
వైద్య అధికారులకు పల్నాడు కలెక్టర్ ఆదేశాలు

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన అన్ని బకాయిలను 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల వైద్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో ఉన్న సౌకర్యాల స్థాయిని, నిధుల ఉత్పత్తిని కలెక్టర్ సమీక్షించారు.
Similar News
News March 11, 2026
TU: MEd మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని MEd 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 25 వరకు మధ్యాహ్నం 2గం.ల నుంచి 5గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. పరీక్షల పూర్తి వివరాలకోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్‌ను సందర్శించాలన్నారు.
News March 11, 2026
గూగుల్, అమెజాన్‌లపై ఇరాన్ గురి

US ఎంబసీలు, సైనిక స్థావరాలపైన దాడి చేస్తున్న ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపైన ఫోకస్ పెట్టింది. USకు చెందిన క్లౌడ్, డేటా అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఇరాన్ కొత్త టార్గెట్ల జాబితాలో చేరాయని ఆ దేశ మీడియా తస్నిమ్ న్యూస్ తెలిపింది. దీంతో గల్ఫ్ సహా ఇజ్రాయెల్‌లోని అమెరికన్ టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఐబీఎమ్, ఒరాకిల్, పాలంటీర్ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
News March 11, 2026
SRPT: లక్ష్యం ఉంటేనే విజయం తథ్యం: కలెక్టర్

విద్యార్థులు లక్ష్యంతో చదివితేనే విజయం సాధ్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించి, వారికి నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీని పరిశీలించారు. పాఠశాల, అంగన్వాడీ నిర్వహణపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తంచేశారు.


