News April 12, 2024
కొమరాడ: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమరాడ మండలం మాదలంగి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నీలకంఠం తెలిపిన వివరాల ప్రకారం.. మాదలంగి గ్రామానికి చెందిన అధికారి వెంకటేశ్ (32) మద్యానికి బానిసై రోజు మద్యం తాగేవాడు. కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.
Similar News
News March 4, 2026
VZM: ‘రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి’

జిల్లాలో జరుగుతున్న రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో అమరావతి నుంచి బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రీసర్వే ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, గడువులోగా రీసర్వేతో పాటు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
News March 4, 2026
ఈ నెల 8న ఘనంగా మహిళ దినోత్సవం: విజయనగరం కలెక్టర్

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్యాం సుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఆదివారం పోలీస్ బ్యారెక్స్‌లో జరిగే జిల్లా స్థాయి కార్యక్రమానికి సుమారు 3 వేల మంది మహిళలు హాజరవుతారని చెప్పారు. మహిళ పారిశ్రామిక వేత్తల సన్మానం, పథకాల స్టాల్స్, అసెట్స్ పంపిణీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
News March 4, 2026
VZM: ‘లక్ష్యం మేరకు ఉద్యాన సాగు విస్తీర్ణం సాధించాలి’

జిల్లాలో ఉద్యాన పంటల సాగును లక్ష్యానికి అనుగుణంగా విస్తరించాలని జిల్లా కలెక్టర్ శ్యాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. రబీ సీజన్‌లో 4,500 ఎకరాలు సాధించామని, ఖరీఫ్‌లో 6,000 ఎకరాల లక్ష్యాన్ని మించి సాధించాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేసి, బోరు బావులు, బిందు సేద్యం సదుపాయాలు కల్పించాలని తెలిపారు.


