News November 19, 2025
VKB: పాఠశాలల్లో బాలల సభలు నిర్వహించాలి: కలెక్టర్

మండలంలోని పాఠశాలల్లో బాలల కోసం బాలసభలు నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ డీపీఆర్సీ భవనంలో బాలసభల నిర్వహణకు పంచాయతీ సెక్రెటరీలు, మండల పంచాయతీ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 20న బాలల సభలు నిర్వహించాలన్నారు. బాలల సభల ద్వారా విద్యార్థులకు అనేక విషయాలపై అవగాహన చేయాలన్నారు.
Similar News
News March 12, 2026
ఇరాన్ దాడిని ఖండించిన భారత్

గుజరాత్‌కు వస్తున్న థాయిలాండ్ కార్గో షిప్ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడి చేయడాన్ని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఈ దాడులు ప్రారంభమైన తొలి దశలోనే భారతీయులు సహా ఎంతో మంది ప్రాణాలు పోయాయని.. వీటి తీవ్రత మరింత పెరిగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా థాయ్ షిప్‌పై దాడి ఘటనలో 20 మందిని రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
News March 12, 2026
కోరుట్ల: ‘ప్రజల నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో చూపాలి’

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని అన్నారు. ప్రజల నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో చూపించాలన్నారు.
News March 12, 2026
మంథని జేఎన్‌టీయూలో నూతన ఆడిటోరియం ప్రారంభం

మంథని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల బ్లాక్-2లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీసీఎస్ ఒప్పందం మేరకు ఉద్యోగాలకు ఎంపికైన 100 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు


