News November 19, 2025
సింగిల్ డెస్క్ విధానం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు: కలెక్టర్

సింగిల్ డెస్క్ విధానం ద్వారా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాల డ్వామా కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 686 దరఖాస్తులు రాగా, 652 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామన్నారు.
Similar News
News March 7, 2026
కొత్తవలసలో యాక్సిడెంట్.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

కొత్తవలస మండలం అర్ధానపాలెం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. భీమాలి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఏ.పరదేశి (38) కొత్తవలస నుంచి భీమాలి వైపు ఆటోతో వెళ్తున్నాడు. విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురుఎదురుగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News March 7, 2026
గుడ్‌న్యూస్.. వారికి వేతనాలు పెంపు!

AP: జలవనరుల శాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పని చేసే లస్కర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రోజు వారీగా ఇస్తున్న ₹350ని ₹550కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో లస్కర్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల వరకు జీతం పెరిగింది. సాగునీటి కాలువలు, తూముల నుంచి నీటి విడుదల, షట్టర్ల మూత, నిర్వహణ, లీకేజీల గుర్తింపు, మరమ్మతు పనులు, పహారా వంటివి లస్కర్లు చూసుకుంటారు.
News March 7, 2026
10th పరీక్షల నిర్వహణపై కలెక్టర్, SP సమీక్ష

10వ తరగతి పరీక్షల నిర్వహణలోఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్‌తో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయని DEO తెలిపారు.


