News November 19, 2025

GWL: గద్వాల ఖ్యాతి నిలిచేలా ప్రతిభ చాటాలి

image

జిల్లాస్థాయి యువజన ఉత్సవాల్లో ప్రథమ స్థానం సాధించిన కళాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని గద్వాల జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బాలభవన్‌లో వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివేకానంద స్ఫూర్తితో గమ్యం చేరుకోవాలని అన్నారు.

Similar News

News March 16, 2026

భద్రాద్రి: సాగునీటి విస్తరణకు ప్రాజెక్టు పనులు వేగం

image

భద్రాద్రి జిల్లాలో సాగునీటి విస్తరణకు కీలకమైన సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు పనులు వేగవంతమై రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. యాతాలకుంట టన్నెల్‌లో మిగిలిన సుమారు 100 మీటర్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 50 వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News March 16, 2026

HYD: హైడ్రా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

image

సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఫిర్యాదుదారుల ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీల ఆధారంగా పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్లాట్, ఇంటి స్థలం కొనేటప్పుడు లోతుగా విచారించి అన్ని సరిగ్గా ఉంటేనే ముందుకు వెళ్లాలని సూచించారు.

News March 16, 2026

KU M.Pharmacy పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

KU M.Pharmacy మొదటి సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫీజును లేట్ ఫీ లేకుండా మార్చి 28 వరకు, రూ.250 లేట్ ఫీతో మార్చి 31 వరకు చెల్లించవచ్చు. అన్ని పేపర్లకు రూ.1000, రెండు బ్యాక్‌లాగ్ పేపర్లకు రూ.500, ఒక్కో ఇంప్రూవ్‌మెంట్ పేపర్‌కు రూ.300 ఫీజుగా నిర్ణయించారు.