News April 12, 2024
రామకృష్ణాపూర్: తండ్రిని చంపిన తనయుడి అరెస్టు

రామకృష్ణాపూర్ పట్టణం అల్లూరి సీతారాం నగర్‌కు చెందిన భామండ్లపల్లి రాయమల్లు(56)ని హత్య చేసిన రాకేష్ అనే నేరస్థుడిని అరెస్టు చేసినట్లు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. రాయమల్లు మద్యానికి బానిసై ఎప్పుడు ఇంట్లో వాళ్లతో గొడవ పడుతుండేవాడు. మృతుడి ఫోన్ కొడుకు రాకేష్ వాడుతున్నాడు. సెల్ ఫోన్ విషయంలో తండ్రి, కొడుకు గొడవపడి కొడుకు తండ్రిని రోకలి బండతో తలపై కొట్టగా మృతి చెందాడు.
Similar News
News March 14, 2026
ఆదిలాబాద్‌లో పది పరీక్షకు 23 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం నిర్వహించిన పరీక్షకు 10887 మంది విద్యార్థులకు గాను 10864 విద్యార్థులు హాజరై 23 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లా అధికారులు విస్తృతంగా సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
News March 14, 2026
భూభారతి పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాల అమలుపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.