News November 19, 2025
NRPT: రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలని వినతి

వరి ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తెచ్చేందుకు గన్ని బ్యాగులు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో నేతలు మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ.. రైతులకు గన్ని బ్యాగులు లేక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Similar News
News March 8, 2026
MDK: పెరిగిన గ్యాస్ ధర.. రూ.36 కోట్ల భారం

కేంద్రం గ్యాస్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచడంతో శనివారం నుంచి కొత్త ధరలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 11.56 లక్షల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉండగా వినియోగదారులపై ఏడాదికి సుమారుగా రూ.36 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పప్పులు, నూనె, బియ్యం వంటి నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతుండగా తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది.
News March 8, 2026
సూర్యాపేట: షూటింగ్ బాల్‌లో శిరీష సత్తా

అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన గార్లపాటి శిరీష క్రీడారంగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. షూటింగ్ బాల్ క్రీడలో 2024 ఆసియా పోటీల్లో కెప్టెన్‌గా వ్యవహరించి స్వర్ణ పతకం, 2026లో కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయిలో 5, రాష్ట్ర స్థాయిలో 8 పతకాలు గెలుచుకున్న ఈమె, గ్రామీణ ప్రాంత మహిళలకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.
News March 8, 2026
రామప్పలోని ఉపాలయాలకు జాతీయ హోదా

ఓరుగల్లులోని చారిత్రక రామప్ప ఉపాలయాలు శివ తారకేశ్వర స్వామి ఆలయం, గొల్లాల ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా గుర్తించేందుకు భారత పురావస్తు శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు ఆలయాలు కాకతీయుల అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనాలు. ఈ నిర్ణయంపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే రెండు నెలల లోపు ఢిల్లీలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) డైరెక్టర్ జనరల్ చిరునామాకు రాసి పంపాలి.


