News April 12, 2024
శ్రీ సత్యసాయి: ఫుడ్ పాయిజన్‌తో 90 మందికి అస్వస్థత

సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లి మిద్దెలలో శుక్రవారం ఫుడ్ పాయిజన్‌తో 90 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో రాముడి గుడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానంలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులతో పాటు మరో 40 మందికి పైగా గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
అనంత: ఈ రోజు నుంచి ఉచితం

గర్భాశయ కాన్సర్‌ను నిర్మూలించేందుకు తగు చర్యలు చేపట్టినట్లు DMHO దేవి తెలిపారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలనకు బాలికలకు ముందస్తుగా HPV టీకాలు బుధవారం నుంచి వేస్తామన్నారు. జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య బాలికలు 16,449 మంది ఉన్నారన్నారు. వారికి సరిపడా డోసులు ముందస్తుగానే జిల్లాకు చేరాయన్నారు. ఒక్కో డోసు ఖరీదు రూ.3,989 కాగా వాటిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్నారు.
News March 10, 2026
బిల్డింగ్స్ అప్రూవల్ విషయంలో అవకతవకలు: ఏసీబీ డీఎస్పీ

అనంతపురం మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు వచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పలువురి ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. బిల్డింగ్స్ అప్రూవల్ విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ప్లానింగ్ రూల్స్, డాక్యుమెంట్స్ ప్రకారం బిల్డింగ్స్ కట్టారా, లేదా అని రేపు ఫీల్డ్ విచారణ చేపడతామన్నారు.


