News November 19, 2025
‘VSP STEEL’ ప్రైవేటీకరణకు CBN కుట్ర: రజిని

AP: కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే కుట్రలకు CBN తెరలేపారని మాజీ మంత్రి రజిని ఆరోపించారు. వైట్ ఎలిఫెంట్ అన్న ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. NDAలో భాగం కాకున్నా జగన్ తన హయాంలో ప్రైవేటుపరం కాకుండా ఆపారని, కానీ ఇప్పుడు కేంద్రం TDP సపోర్టుతో నడుస్తున్నా ఆ దిశగా కదులుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు బాబు ప్లాంటుకు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News March 20, 2026
గల్ఫ్‌కు US ₹1.5 లక్షల కోట్ల ఆయుధాలు

UAE, కువైట్‌కు దాదాపు ₹1.5 లక్షల కోట్ల మిలిటరీ సేల్స్‌కు US ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మిస్సైల్, డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, మిస్సైల్స్, F-16 యుద్ధ విమానం కోసం వివిధ రకాల ఆయుధాలను అమ్మనుంది. US, ఇజ్రాయెల్‌పై ప్రతీకారంతో ఇరాన్ ఈ 2 దేశాల్లోని అమెరికా బేస్‌లను టార్గెట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో కొన్ని ఆయిల్, గ్యాస్ ఫీల్డ్‌లూ లక్ష్యంగా మారుతున్నాయి.
News March 20, 2026
ధురంధర్-2: తొలి రోజే ₹100 కోట్లు!

భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి రోజే ₹102 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసిందని Sacnilk తెలిపింది. ప్రీమియర్స్‌తో కలుపుకొని ₹145 కోట్లు(₹172 Cr గ్రాస్) రాబట్టిందని వెల్లడించింది. 12,735 ప్రీమియర్ షోలు, తొలి రోజు 21,728 షోలు పడినట్లు చెప్పింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
News March 20, 2026
ఆ 22 నౌకలొస్తేనే..

పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే శివాలిక్, నందాదేవి నౌకలు LPGతో భారత్ చేరుకోవడంతో స్వల్ప ఉపశమనం లభించింది. కానీ మరో 22 షిప్‌లు <<19422225>>హార్ముజ్<<>> వద్దే నిలిచిపోయాయి. ఈ నౌకలే భారత ఇంధన భద్రతకు కీలకం. వీటిని హార్ముజ్ దాటించడానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నౌకల రాక ఆలస్యమైనా, చాలాకాలం అక్కడే చిక్కుకుపోయినా దేశంలో గ్యాస్ కొరత మరింత తీవ్రమయ్యే ఆస్కారముంది.


