News April 12, 2024
విద్యార్థినులకు ‘పీరియడ్’ సెలవులు: పంజాబ్ వర్సిటీ
చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ కీలక ప్రకటన చేసింది. ఇకపై విద్యార్థినులకు పీరియడ్ సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఒక సెమిస్టర్‌కు గరిష్ఠంగా 4 లీవ్‌లు తీసుకునేందుకు అనుమతి ఇస్తామని పేర్కొంది. అయితే సెమిస్టర్, ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సెలవులు ఉండవని వెల్లడించింది. కాగా కేరళలోని కొచ్చిన్ వర్సిటీ, నల్సార్(HYD), గువాహటి వర్సిటీ, తేజ్‌పూర్ వర్సిటీ విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.
Similar News
News November 16, 2024
ఆధార్ ఉన్నవారికి అలర్ట్
మీ ఆధార్ దుర్వినియోగమైందా? లేదా? తెలుసుకోవాలంటే..
* <
* తర్వాత అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయండి.
* అక్కడ ‘ఆల్’ని సెలెక్ట్ చేసి ‘ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ’పై క్లిక్ చేస్తే మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే వివరాలు తెలిసిపోతాయి. మీ ఆధార్ దుర్వినియోగమైనట్లు తెలిస్తే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
News November 16, 2024
‘అమరన్’ థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి
తమిళనాడులోని తిరునల్వేలిలో ‘అమరన్’ మూవీ ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు 3 పెట్రోల్ బాంబుల్ని హాల్‌పైకి విసరడం సీసీ కెమెరాల్లో నమోదైంది. స్థానికుల మధ్య ఉన్న తగాదాలే దీనికి కారణమని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. సినిమాలో కొన్ని సన్నివేశాలపై తమిళనాట కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News November 16, 2024
అయ్యో.. ఈ తల్లులకు ఎందుకీ కడుపుకోత?
UPలోని ఝాన్సీలో మెడికల్ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది పసిప్రాణాలు బలయ్యాయి. నవమాసాలు మోసి కన్న పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాలని, ఉన్నతంగా తీర్చిదిద్దాలని అమాయక తల్లులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు తమ పిల్లల కోసం పిల్లల వార్డులోకి వెళుతుంటే సిబ్బంది తమను అడ్డుకున్నారని, చివరికి బిడ్డల డెడ్‌బాడీలను తీసుకొచ్చి ఇచ్చారని ఆ తల్లులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.