News November 19, 2025
Way2News కథనానికి నాగార్జున వర్సిటీ స్పందన

<<18322201>>మాస్టారూ.. ఇదేం క్వశ్చన్ పేపర్?<<>> అంటూ Way2Newsలో మంగళవారం వచ్చిన వార్తకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల సమన్వయకర్త స్పందించారు. బీఈడి, ఎంఈడీ, ఎల్‌బీబీ, పీజీ సైన్స్, ఆర్ట్స్ పరీక్షలు ఒకే సమయంలో ఉండటం వల్ల పొరపాటున Msc 3rd సెమిస్టర్ ప్రశ్నాపత్రం రాతపూర్వకంగా వచ్చిందని తెలిపారు. ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News March 9, 2026
ప్రజా సమస్యలపై 112 ఫిర్యాదులు స్వీకరించిన గుంటూరు ఎస్పీ

గుంటూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ వకుల్ జిందాల్ 112 ఫిర్యాదులను స్వీకరించారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్లకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను చట్టపరంగా వేగంగా పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు.
News March 9, 2026
గుంటూరు బస్టాండ్‌లో దొంగల బీభత్సం.. పని చేయని సీసీ కెమెరాలు

గుంటూరు ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్‌లో గత కొన్ని నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిఘా లేకపోవడంతో నిత్యం 5 నుంచి 10 దొంగతనాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. వరుస చోరీలతో భయాందోళనకు గురవుతున్న బాధితులు.. తక్షణమే స్పందించి బస్టాండ్‌లో కొత్త కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని వేడుకుంటున్నారు.
News March 8, 2026
టెన్నిస్‌లో సత్తా చాటిన గుంటూరు బిడ్డ లక్ష్మీ పోలూరి

గుంటూరులో జన్మించిన లక్ష్మీ పోలూరి టెన్నిస్‌లో అద్భుతాలు సృష్టించారు. మూడేళ్ల వయసులో ఆమె కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు. 14 ఏళ్లకే దిగ్గజ క్రీడాకారిణి మోనికా సెలెస్‌ను ఓడించి ‘ఆరెంజ్ బౌల్’ టైటిల్ గెలిచారు. 15 ఏళ్ల వయసులో ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకుని సత్తా చాటారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో విద్యాభ్యాసం చేసి, యూఎస్ కాలేజియేట్ నంబర్-1గా నిలిచారు.


