News November 19, 2025

గజ్వేల్: లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

గజ్వల్ మైనారిటీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ-ఫిజిక్స్, పీజీటీ-మాథ్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి నాగరాజమ్మ తెలిపారు. దరఖాస్తులను గజ్వేల్ కళాశాలలో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు అందివ్వాలన్నారు. మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తామన్నారు.

Similar News

News March 19, 2026

గ్యాస్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి: రిజ్వాన్ బాషా

image

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు నూతన నిబంధనలను అమలు చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ మార్పులను గమనించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే బుకింగ్ చేయాలని సూచించారు.

News March 19, 2026

ప్రభుత్వాల పాలన ప్రజా రంజకంగా ఉంటుంది: బుట్టే వీరభద్ర దైవజ్ఞ

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఈ ఏడాది ప్రజా రజకంగా ఉంటుందని శ్రీశైల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ అన్నారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు మంచిగా కురుస్తాయన్నారు. దేశం సుభిక్షంగా ఉంటూ ప్రజలు సంతోషంగా ఉంటారని, గోవులు అధిక క్షీరాన్ని ఇస్తాయన్నారు. ఈ ఏడాది భారత దేశంలో ఎటువంటి గ్రహణములు కనపడవన్నారు.

News March 19, 2026

అదృష్టం తెచ్చిన కూతురు..

image

‘ధురంధర్’తో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ స్టార్‌డమ్ అమాంతం పెరిగింది. కొవిడ్ తర్వాత ఆయన తీసిన చిత్రాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. 2022లో జయేశ్‌భాయ్ జోర్దార్, సర్కస్, 2023లో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 2024లో రణ్‌వీర్, దీపికా పదుకొణె దంపతులకు పాప జన్మించింది. 2025లో డైరెక్టర్ ఆదిత్య ధర్ ‘ధురంధర్’ ప్రాజెక్టు రావడంతో రణ్‌వీర్ బ్లాక్‌బస్టర్ కొట్టారు.