News November 19, 2025

పెద్దపల్లి: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ

image

తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలని, అలాగే పత్తిలో మాయిశ్చర్‌ పరిమితిని 20 శాతం వరకు సడలించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. మిల్లర్లు అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా ఎంపీ కోరినట్లు తెలిపారు.

Similar News

News March 25, 2026

మంథని నియోజకవర్గం ‘చీలి’పోనుందా?

image

2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో మంథని నియోజకవర్గం రెండుగా చీలిపోనుందనే చర్చ జోరందుకుంది. నియోజకవర్గంలో 10 మండలాలు, 2.40 లక్షల మంది ఓటర్లున్నారు. భౌగోళికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంథని పెద్ద నియోజకవర్గం. కాగా, కాటారం, మహాదేవపూర్, మహ ముత్తారం, మల్హర్, పలిమెల మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు అవుతుందనే రాజకీయ చర్చ నడుస్తోంది.

News March 25, 2026

ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనంది: ట్రంప్

image

న్యూక్లియర్ వెపన్స్‌ను ఎప్పటికీ తయారు చేయనని ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. రీసెంట్‌గా జరిగిన చర్చల్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తోందని, ఇరాన్ ఇప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడుతోందని అన్నారు. అయితే ఇరాన్ అధికారులు మాత్రం ఈ చర్చల వార్తలను కొట్టిపారేస్తున్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం ఐదు రోజుల గడువు ఇచ్చి డీల్ కుదురుతుందన్న ఆశతో ఉన్నారు.

News March 25, 2026

సంగారెడ్డి: టీబీ రహిత గ్రామంగా కడ్పల్ ఎంపిక

image

సిర్గాపూర్ మండలం కడ్పల్ టీబీ రహిత గ్రామంగా ఎన్నికైనట్లు జిల్లా టీబీ సూపర్వైజర్ అరుణకుమారి తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డిలో సర్పంచ్ మల్లగారి విమల, కార్యదర్శి అరుణ్ కుమార్‌ను అభినందిస్తూ ప్రశంసాపత్రం అందజేశారు. గ్రామంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. టీబీ నిర్మూలనలో బాచేపల్లి PHCకి 3వ స్థానం దక్కింది.