News November 19, 2025

HYD: ‘డ్రగ్స్ వద్దు.. కెరీర్ ముద్దు’

image

డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి జోలికి వెళ్తే జీవితం అగమ్య గోచరంగా మారుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవాల సందర్భంగా మెడికల్ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవేర్నెస్ కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, ఐఏఎస్ అధికారి అనిత రామచంద్రన్, టీ న్యాబ్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 22, 2026

HYD: కుప్పకూలిన బాల్కానీ స్లాబ్.. తండ్రీకొడుకుల మృతి

image

పంజాగుట్ట PS పరిధిలోని కుందన్‌బాగ్ శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని బాల్కనీ పొడిగింపు కోసం ఐరన్ రాడ్‌లతో నిర్మించిన భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఎలక్ట్రిషియన్ పనికోసం వచ్చిన తండ్రీకొడుకులు వివేక్, దేవిదాస్ ప్రాణాలు కోల్పోయారు. ఇంటి యజమాని ద్వారకా ప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 22, 2026

HYD: ‘లే అమ్మా..’ రాత్రంతా తల్లి శవం వద్ద కూతురు

image

నగర శివారు షాద్‌నగర్‌లోని రంగారెడ్డిగూడకి చెందిన శోభ దారుణ హత్యకు గురైన విషయం <<19447260>>తెలిసిందే<<>>. ఉదయం పొలాల్లో పసిపాప ఏడుపు వినిపించడంతో గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి నుంచి కూతురు తల్లి మృతదేహం వద్దనే ‘లే.. అమ్మా’ అంటూ రోదిస్తున్న దృశ్యం అందరిని కలిచివేసింది.

News March 22, 2026

HYD: బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు

image

ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై 21మీ. పైబడిన భవనాలను హైరైజ్‌గా పరిగణిస్తారు. భవన నిర్మాణ అనుమతులకు 50% TDR తప్పనిసరి కాగా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందేలోపు మిగిలిన 50% చెల్లించాలి. రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తులకు అనుమతిస్తారు. సెట్ బ్యాక్ సడలింపులు అదనపు అంతస్తుల వినియోగంలో TDR లోడింగ్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించింది.