News November 19, 2025

అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.7వేలు

image

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.5వేలు.. మొత్తంగా రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.

Similar News

News March 23, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

కేరళ ఎన్నికల్లో తెలంగాణ నేతలు బిజీబిజీ!

image

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రులు, నేతలు బిజీ అయ్యారు. కీలక నియోజకవర్గాలకు ఇంఛార్జిలుగా పలువురిని AICC నియమించింది. ఎర్నాకులం, త్రిశూర్ జిల్లాలకు మంత్రి శ్రీధర్ బాబు బాధ్యతలు చేపట్టగా కొల్లాం నియోజకవర్గానికి MLA ఉత్తమ్ పద్మావతిని కేటాయించారు. అలాగే కల్లియస్సేరి ఇంఛార్జిగా హర్కర వేణుగోపాల్ రావు, దేవీకులం బాధ్యతలను MLC బల్మూర్ వెంకట్ చూస్తున్నారు. మరికొంత మంది మంత్రులూ వెళ్లనున్నారు.